‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ న్యూస్ !

‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ న్యూస్ !

Published on Sep 21, 2025 10:00 AM IST

alluarjun-atlee

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం బన్నీ కొత్త గెటప్ ట్రై చేస్తోందని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికే మెయిన్ హైలెట్ గా నిలిచిపోతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణె ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ కోసం చూస్తోంది టీమ్. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించనున్న మిగిలిన నటీనటుల గురించి కూడా అప్ డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.

తాజా వార్తలు