
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని ఆల్రడీ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సాంగ్ ని ఈ ఏడాదికి ముగింపుగా ఈ జనవరి 31న విడుదల చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది.
ఇక ఇదే రోజున మరో ట్రీట్ మెగా ఫ్యాన్స్ కి రానుంది అన్నట్టుగా మరో టాక్ ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యింది. అదే జనవరి 31న పెద్ది సినిమా నుంచి రెండో సాంగ్ ని వదలాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఇదే నిజం అయితే మాత్రం ఆరోజున డబుల్ ట్రీట్ అని చెప్పాలి. మరి వీటిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెద్ది చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

