టాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ ‘కోర్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తుండగా ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంగేజింగ్ కంటెంట్‌తో సాగింది. ప్రేమలో ఉన్న ఓ టీనేజ్ కుర్రాడి పై పోక్సో కేసు నమోదు కావడం.. అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం.. అతడి కుటుంబ సభ్యులను బెదిరించడం వంటి అంశాలు ఈ ట్రైలర్ కట్లో చూపెట్టారు. ఎవరూ ఈ కేసును టేకప్ చేయని పరిస్థితిలో ప్రియదర్శి రిస్క్ చేసి ఈ కేసును వాదించేందుకు సిద్ధమవుతాడు. ఇక ఆపై జరిగే నాటకీయ పరిణామాల సమాహారమే ఈ ‘కోర్ట్’ మూవీ కథ అని ఈ ట్రైలర్లో తెలిపారు. ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం మేజర అసెట్‌గా నిలవనున్నట్లు ఈ ట్రైలర్‌లోని బీజీఎం వింటే స్పష్టమవుతుంది.
ఇక ఈ సినిమాలో సాయి కుమార్, శివాజీ, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేక సుధాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందించగా ప్రశాంతి తిపిర్నేని ప్రొడ్యూస్ చేశారు. మార్చి 14న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.