ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ వారం రిలీజ్ అయిన రెండు బడా చిత్రాలు సందడి చేస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’.. బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సినిమాలను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
అయితే, ఈ సినిమాలకు ఇండియాతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇందులో ‘కూలీ’ చిత్రాన్ని అమెరికా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కు అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుండడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నార్త్ అమెరికాలో కూలీ చిత్రం ఏకంగా 4 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది.
రజినీ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో కూలీ మరోసారి ప్రూవ్ చేసింది. అంతేగాక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ అంటే కూడా అక్కడి ప్రేక్షకులకు ఎంత ఇష్టమో ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. మరి ఈ సినిమాకు ఈ వీకెండ్‌లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ వస్తాయా.. ఈ చిత్రం ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.