తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘కూలీ’ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాను ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను చూసేందుకు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఆసక్తిని చూపుతున్నారు. కాగా ఈ సినిమాను నార్త్ అమెరికాలో ఆగస్టు 13న గ్రాండ్ ప్రీమియర్స్ వేస్తుండగా, దీని కోసం ఇప్పటికే 40 వేలకు పైగా టికెట్ బుకింగ్స్ అయ్యాయి. ఇలా ప్రీమియర్స్‌కే ఈ రేంజ్లో ర్యాంపేజ్ కనిపిస్తుండటంతో ఈ సినిమా ప్రీమియర్స్‌లో దుమ్ములేపడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.