‘కూలీ’ అఫీషియల్ రన్ టైం బయటకి.. మొత్తం ఎంతసేపు రచ్చ అంటే

‘కూలీ’ అఫీషియల్ రన్ టైం బయటకి.. మొత్తం ఎంతసేపు రచ్చ అంటే

Published on Aug 8, 2025 3:00 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్, కన్నడ నుంచి రియల్ స్టార్ ఉపేంద్ర, మళయాళ సినిమా నుంచి సౌబిన్ లాంటి స్టార్ నటీనటుల కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. గట్టి అంచనాలు సెట్ చేసుకున్న సినిమా సెన్సార్ పనులు ముగించుకొని రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

అయితే కూలీ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి థియేటర్స్ లో ఎంతసేపు రచ్చ ఉంటుందో ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా టోటల్ రన్ టైం 3 గంటలు దగ్గరకే వచ్చేసింది. అఫీషియల్ రన్ టైం 2 గంటల 49.57 నిమిషాలు కాగా లోకేష్ కనగరాజ్ గత సినిమాల తరహాలోనే వచ్చిందని చెప్పాలి. మరి కూలీ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రం రానున్న ఆగస్ట్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

తాజా వార్తలు