సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్ ఇంకా ఉపేంద్ర లాంటి స్టార్స్ నటించిన అవైటెడ్ చిత్రమే ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఎనలేని హైప్ సెట్ చేసుకుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో సంచలన ఓపెనింగ్స్ అందుకోగా కెనడా మార్కెట్ లో ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ఈ సినిమా అందుకుంది.
ఆంతే కాకుండా అక్కడ డిమాండ్ పెరగడంతో అదనపు షోస్ కూడా పెంచుతున్నారట. మొత్తానికి టాక్ తో సంబంధం లేకుండా తలైవర్ అదరగొడుతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.