భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చేస్తుందని అందరూ అనుకున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజనీకాంత్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని తమిళ సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. దీంతో అభిమానుల్లోనూ అదే స్థాయి ఉత్సాహం కనిపించింది.
అయితే, విడుదలైన తర్వాత కూలీ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలి వీకెండ్‌లో మంచి కలెక్షన్లు వచ్చినా, ఆ తర్వాత ఇవి బాగా తగ్గాయి. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం రూ.500 కోట్ల మార్క్ కూడా అందుకోలేకపోయింది.
భారీ బడ్జెట్, స్టార్ హీరో ఇమేజ్, భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడం మరియు ఎమోషనల్ కనెక్ట్ కాకపోవడంతో వసూళ్లపై ప్రభావం పడింది. ఫలితంగా, రికార్డులు బద్దలు కొడుతుందని భావించిన ‘కూలీ’ చివరికి అంచనాలను అందుకోలేకపోయింది.