జూలై నుండి జనవరి వరకు నిరంతరాయంగా జరగనున్న ‘బాద్షా’ షూటింగ్


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కనున్న కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “బాద్షా”. ఈ చిత్రం చిత్రీకరణ ఈ నెలలో మొదలై జనవరి వరకు నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 9వ తేదీ నుంచి ఇటలీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఇండియా మరియు బ్యాంకాక్లో జరిగే షెడ్యూల్స్ ప్రారంభమవుతాయి. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కొత్త లుక్ మరియు కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version