అందాల భామ శ్రియ సరన్ ఇటీవలే మాగ్జిం మాగజైన్ కి ఫుల్ హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలతో శ్రియ కుర్రకారుకు మతి పోగొట్టింది. అలాంటి శ్రియ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి కమర్షియల్ సినిమాల్లో నటించాలన్న ఉద్దేశాన్ని మార్చుకున్నాను అంటోంది. ఇంతకీ ఈ మాట ఎందుకు అంటోందో ఆమె మాటల్లోనే ‘ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల కంటే మచి కథా బలం ఉన్న సినిమాల్లో నటిస్తేనే నటిగా ఎంతో సంతృప్తి కలుగుతుందని తెలుసుకున్నానని’ అన్నారు .
బహుశా శ్రియలో ఈ మార్పు ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ సినిమా చేసిన తర్వాతే వచ్చినట్టుంది. ప్రస్తుతం శ్రియ కూడా పెద్దగా కమర్షియల్ సినిమాలు ఏమీ చేయడం లేదు, కనుక మంచి కథా బలం ఉన్న సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు పొందాలని ఆశిద్దాం. ప్రస్తుతం శ్రియ జనార్ధన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్న ‘పవిత్ర’ సినిమాలో నటిస్తోంది, ఇందులో శ్రియ వేశ్య పాత్రలో కనిపించనున్నారు.