ఒక ఇంటివాడైన కమెడియన్ మహేష్

ఫేమస్ తెలుగు కామెడీ షో జబర్ధస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని నటుడిగా మారిన మహేష్ ఆచంట నేడు వివాహం చేసుకున్నారు. మహేష్, పావనిల వివాహం నేడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం, శివకోడు గ్రామంలో జరిగింది. నేడు ఉదయం 6:31 నిమిషాల ముహూర్తానికి మహేష్… పావని మెడలో తాళి కట్టాడు.

లాక్ డౌన్ నిబంధల కారణంగా ఈ వివాహానికి కేవలం వధూవరుల తల్లితండ్రులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. కమెడియన్ గా వెండితెరకు పరిచయమైన మహేష్ రంగస్థలం, మహానటి, గుణ 369, యాత్ర వంటి చిత్రాలలో కీలక రోల్స్ చేశాడు. కాగా నేడు ఇదే ముహూర్తానికి నిఖిల్, పల్లవిని పెళ్లి చేసుకున్నారు.

Exit mobile version