సెప్టెంబర్ 21న కెమరామెన్ గంగతో రాంబాబు ఆడియో


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ ల కలయికలో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” ఆడియో విడుదల సెప్టెంబర్ 21న జరుపుకోనుంది. ఈ చిత్రం ఇప్పటికే టాకీ భాగం మొత్తం పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకోనుంది. తమన్నా కథానాయికగా ఈ చిత్రంలో కనిపించనుంది. టివి జర్నలిస్ట్ పాత్రలో తమన్నా పవన్ సరసన కనిపించనున్నారు. గబ్రియేల బెర్తంతే మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ఆడియో కూడా “గబ్బర్ సింగ్” చిత్ర ఆడియోలానే విజయం సాదిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన పోస్టర్స్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయ్యింది. ఈ ఏడాది విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ రెండవ చిత్రం ఇది కావడం అభిమానులకు ఉత్సాహనిచ్చే అంశం.

Exit mobile version