మళ్ళీ థియేటర్స్ లోకి క్లాసిక్ ‘అందాల రాక్షసి’.. డేట్ ఇదే!

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని అండర్ రేటెడ్ క్లాసిక్ హిట్ చిత్రాల్లో అందులోని ప్రేమ కథా చిత్రాల్లో “అందాల రాక్షసి” కూడా ఒకటి. నవీన్ చంద్ర అలాగే రాహుల్ రవీంద్రన్ ఇంకా లావణ్య త్రిపాఠి కలయికలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది.

మరి దాదాపు ఒక దశాబ్దం కితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి ఆదరణ అందుకోలేదు కానీ ఇప్పటికి కల్ట్ స్టేటస్ సొంతం చేసుకుంది. మరి ఈ మధ్య కాలంలో వస్తున్న రీరిలీజ్ ల బాటలో ఈ సినిమా కూడా చేరింది. ఇలా ఈ జూన్ 13 నుంచి థియేటర్స్ లో సందడి చేసేందుకు ఈ చిత్రం సిద్ధం అయ్యింది. మరి ఈసారి ఎలాంటి రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించగా రాజమౌళి నిర్మాణం వహించారు.

Exit mobile version