“వకీల్ సాబ్” అప్డేట్ అయితే ఉంది..కానీ..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దీనిని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పవన్ అభిమానులు.

కానీ ఊహించని బ్రేక్ లు వారి ఉత్సాహానికి పడ్డాయి. అయితే ఇదిలా ఉండగా పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఈ చిత్రం తాలూకా టీజర్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ అది మాత్రం ఇప్పుడప్పుడే నెరవేరేలా లేదని కన్ఫామ్ అయ్యింది. అది కాకున్నా ఏదన్నా అప్డేట్ కోసం అయినా చూస్తున్నారు.

అయితే ఆ అప్డేట్ ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడప్పుడే కాదట. తొందరలోనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కన్ఫామ్ అయ్యింది. మరి అప్పటి వరకు పవన్ అభిమానులు వేచి చూడక తప్పదు. ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే దిల్ అండ్ శిరీష్ లు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version