ఫ్యాక్టన్ మూవీతో ప్లాప్స్ నుండి బయటపడిన చిరు.

ఫ్యాక్టన్ మూవీతో ప్లాప్స్ నుండి బయటపడిన చిరు.

Published on Jul 24, 2020 12:59 PM IST

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి- సౌందర్య జంటగా వచ్చిన అన్నయ్య మూవీ మంచి విజయం అందుకుంది. ఐతే ఆ మూవీ తరువాత చిరు చేసిన రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మృగరాజు, సురేష్ కృష్ణ తెరకెక్కించిన డాడీ చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీనితో మంచి ఫార్మ్ లో ఉన్న మాస్ డైరెక్టర్ బి గోపాల్ తో చిరు ఓ మూవీకి కమిటయ్యాడు.

రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కొడుతుండగా బి గోపాల్, చిరంజీవితో కూడా అదే నేపథ్యంలో ఇంద్ర అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కెరీర్ లో మొదటిసారి ఫ్యాక్షనిస్ట్ రోల్ చేసిన చిరంజీవి కోర మీసం, వైట్ అండ్ వైట్ లో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ఇక ఆయన డైలాగ్స్ మరియు డాన్స్ లు మెస్మరైజ్ చేశాయి. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచాయి. 2002 జులై 24న విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ప్లాప్స్ లో ఉన్న చిరుని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇంద్ర విడుదలై నేటికి ఖచ్చితంగా 18ఏళ్ళు అవుతుంది.

తాజా వార్తలు