మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. చుట్టూ చేరిన గుండాలను తుక్కు తుక్కుగా కొడుతున్నాడు. హైదరాబాద్ లోని కోకా పేట్ లో వేసిన ఓ భారీ సెట్ లో చిరంజీవిపై ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ చిరంజీవి 152వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఐతే ఈ చిత్రం కొరకు దాదాపు 20కోట్లకు పైగా ఖర్చుతో ఓ భారీ కాలనీ సెట్ ఏర్పాటు చేశారు. ఈ భారీ సెట్ నందు ఓ యాక్షన్ సన్నివేశాన్ని కొరటాల చిరంజీవిపై తెరకెక్కిస్తున్నారు. ఓ ఆలయంతో పాటు కూడిన ఈ భారీ సెట్ నందు చిత్రానికి సంబందించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారట.
ఇక సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ సబ్జెక్టు తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన జరగలేదు.