సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దాడిపై చరణ్ వివరణ ఇచ్చారని, దానిపై తను మాట్లాడటానికి ఏమి లేదని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. గత ఆదివారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు మధ్య గొడవ జరగడం, రామ్ చరణ్ రక్షణా సిబ్బంది వారిపైన దాడి జరపడం తెలిసిందే. ప్రస్తుతం కాకినాడ పర్యటనలో ఉన్న చిరంజీవి అందులో భాగంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడగా ఈ ప్రశ్నకుగానూ చరణ్ వివరణ ఇచ్చినదే ఇంకా చివరి ఘటన అని, తాను ఇందులో ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపారు.