మెగాస్టార్ చిరంజీవి కరోనా పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవి కరోనా పాజిటివ్

Published on Nov 9, 2020 11:10 AM IST

లాక్ డౌన్ ప్రకటించగానే మెగాస్టార్ చిరంజీవి తన ‘ఆచార్య’ చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తివేశాక కూడ ఆయన షూటింగ్ చేయడానికి సుముఖత చూపలేదు. కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గాక షూటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ అన్ని సినిమాల చిత్రీకరణలు మొదలుకావడంతో చిరు కూడ సెట్స్ మీదకు వస్తే బాగుండని అందరూ అన్నారు. చిరు సైతం ఇప్పటికే ఏడు నెలలకు పైగా ఆలస్యం కావడంతో షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అయ్యారు.

దీంతో టీమ్ చిత్రీకరణకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంకో మూడు నాలుగు రోజుల్లో షూటింగ్ ఉండటంతో ముందు జాగ్రత్తగా చిరు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని చిరు స్వయంగా తెలిపారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని, కానీ పరీక్షలో పాజిటివ్ వచ్చిందని, అందుకే ఐసోలేషన్ తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే గత ఐదు రోజులుగా తనను ఎవరెవరైతే కలిశారో వారంతా ఒకసారి కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిదని సూచించారు. చిరుకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

తాజా వార్తలు