లెజెండరీ దర్శకుని ఆశీస్సులు తీసుకున్న మెగాస్టార్.!

లెజెండరీ దర్శకుని ఆశీస్సులు తీసుకున్న మెగాస్టార్.!

Published on Nov 14, 2020 11:24 PM IST

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలువురు దర్శకులు కథానాయకులకు ప్రత్యేకమైన అధ్యయాలు ఉంటాయి. అలాంటి లెజెండరీ దర్శకులు హీరోల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి అలాగే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఖచ్చితంగా ఉంటారు. రుద్ర వీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి ఆణిముత్యాలను మెగాస్టార్ తో తీసిన ఈ లెజెండరీ దర్శకునికి అలాగే చిరుకి ఎంతటి బాంధవ్యం ఉందో తెలిసిందే.

అలాగే విశ్వనాథ్ గారి పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని కూడా చిరు పలు మార్లు వ్యక్త పరిచారు. అయితే ఈరోజు దీపావళి పర్వదినం సందర్భంగా చిరు విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అంతే కాకుండా వారి కుటుంబంతో కలిసి కాసేపు ముచ్చటించి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఇప్పుడు వీరు కలసిన ఈ అందమైన ఫొటోలే సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజా వార్తలు