కేంద్ర పర్యాటక మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కేన్స్ ఫిల్మ్ వేడుకలకు హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. మాజీ నటుడు, యూనియన్ మినిస్టర్ చిరంజీవి ఈ వేడుకలో పాల్గొని పలువురు ఇంటర్నేషినల్ ఫిల్మ్ మేకర్స్ ని కలిశారు. ఫిల్మ్ టూరిజంకి ఇండియా ప్రధాన ఆకర్షణ అవుతుందని అన్నాడు. చిరంజీవి ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా దర్శకుడు ఆంగ్ లీ, ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి ఆరేలి ఫిలిప్పెట్టి, అలాగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ జిల్ జాకబ్ మొదలగు వారిని కలిశాడు. ఇండియాలో విదేశీ సినిమాల నిర్మాణానికి వీలైనంత త్వరగా అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంలో ఆయన మాట ఇవ్వడం జరిగింది. చిరంజీవితో పాటుగా ఆయన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.