మళ్లీ డాన్సు వేసిన చిరు


ఇండియాలో ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ డాన్సర్. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక సినిమాలకు డాన్సులకు దూరమయ్యారు. ఆయన నిన్న డాన్సు వేసారు. కానీ ఆయన డాన్సు వేసింది ఆయన కొత్త సినిమా కోసం కాదు. చిరంజీవి మరియు మరికొంత మంది రాజకీయ నాయకులు అరకులో జరిగిన మినీ అసెంబ్లీ సమావేశంలో అందరూ కలిసి డాన్సు వేసారు. అక్కడ గిరిజనుల ‘ధింసా’ డాన్సు వేసి అలరించారు. చిరంజీవి 150 వ చిత్రం మొదలవుతుందంటూ ఊరిస్తూ వస్తున్నారు. త్వరలోనే ఆ చిత్రం ప్రారంభం కావాలని ఆశిద్దాం.

Exit mobile version