మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఎవడు’ సినిమా ఆడియో ఈ రోజు హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా టీం మెంబర్స్ అయిన దిల్ రాజు, వంశీ పైడిపల్లి, దేవీశ్రీ ప్రసాద్, రామ్ ప్రసాద్ మొదలైన వారందరితో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను. వారందరూ ఈ సినిమాకి ది బెస్ట్ ఇచ్చారు. కెరీర్ మొత్తం మీద మగధీర లాంటి సినిమాలు ఒకటి రెండు మాత్రమే వస్తాయి. మగధీర తర్వాత అలాంటి సినిమాలు ఎప్పుడొస్తాయో అనుకున్న నాకు ఇంత త్వరగా ‘ఎవడు’ రూపంలో రావడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘ చరణ్ చెప్పినట్టు ఇంత త్వరగా ‘మగధీర’ ని మించిన సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అభిమానుల ఊహించుకున్న దానికంటే ఎక్కువగానే ఉంటుంది. మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్ర ఎలాగో ఈ సినిమాలో ధర్మ పాత్ర అంత పవర్ఫుల్ గా ఉంటుంది. అలాంటి పాత్రని సాయి కుమార్ చాలా బాగా పోషించాడు. ఈ సినిమా ‘మగధీర’ని మించి ‘ఎవడు’ ఉంటుందని’ అన్నారు.