అనుష్కకి డబ్బింగ్ చెప్పనున్న చిన్మయి.!

anushka-and-chinmayi

చిన్మయి సౌత్ లో ఎన్నో పాటలకి తన మధురమైన గాత్రాన్ని అందించి సింగర్ గా మంచిపేరు తెచ్చుకుంది. అలాగే అందాల భామ సమంతకి మొదటి సినిమా నుంచి డబ్బింగ్ చెప్పడం వల్ల చిన్మయికి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా సందరభాల్లో చిన్మయితో పనిచెయ్యడం చాలా అందంగా ఉందని తెలిపింది.

తాజాగా చిన్మయి తన కెరీర్లో మొదటి సారిగా అనుష్కకి డబ్బింగ్ చెప్పడానికి సిద్దమవుతోంది. చిన్మయి అనుష్క నటించిన తమిళ్ మూవీ ‘ఇరందం ఉలగమ్’ కి డబ్బింగ్ చెప్పనుంది. ఈ సినిమా తెలుగులో వర్ణ గా రిలీజ్ కానుంది. చిన్మయి డబ్బింగ్ తో పాటు ఓ మూవీలో ఓ పాట కూడా పాడింది. సెల్వ రాఘవన్ చిన్మయి వర్క్ విషయంలో చాలా హ్యాపీ గా ఉండటమే కాకుండా ఆమెని పొగడ్తలతో ముంచెత్తాడు. హారీష్ జైరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో అనిరుధ్ రవిచంద్రన్ ఓ పాటని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఈ రోజు తెలుగు వెర్షన్ వర్ణ ఆడియో శిల్ప కళావేదికలో జరగనుంది. ఆర్య హీరోగా నటించిన ఈ మూవీని పివిపి బ్యానర్ వారు నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version