‘చైనా పీస్’ నుంచి ‘జేమ్స్ బాండ్’ సాంగ్ విడుదల

James Bond

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ప్రత్యేకమైన స్పై డ్రామా ‘చైనా పీస్’ నుంచి ‘ఇదేంటో జేమ్స్ బాండ్’ పాటను మేకర్స్ విడుదల చేశారు. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై నిర్మితమైంది. ఈ చిత్రంలో కథానాయకులతో పాటు కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, ముఖ్యంగా టీజర్, సినీ ప్రియుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, యాక్షన్, థ్రిల్, అలాగే హాస్యం అంశాలతో కూడిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. తాజాగా రిలీజ్ చేసిన ‘ఇదేంటో జేమ్స్ బాండ్’ పాటను సంగీత దర్శకుడు కార్తీక్ రోడ్రిగ్జ్ ఎనర్జిటిక్‌గా కంపోజ్ చేశారు. ఈ పాటకు స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ గాత్రం అందించగా, దినేష్ కాకర్ల రాసిన సాహిత్యం పాటలోని థీమ్‌ను సరదాగా ఆవిష్కరించింది.

ఈ చిత్రానికి సురేష్ రగుతు కెమరామెన్‌గా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. యూనిక్ స్పై డ్రామాగా వస్తున్న ‘చైనా పీస్’ త్వరలోనే థియేటర్లలోకి రానుంది

Exit mobile version