“ఛావా” విధ్వంసం.. మూడో ఫ్రైడే ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్

“ఛావా” విధ్వంసం.. మూడో ఫ్రైడే ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్

Published on Mar 1, 2025 10:00 PM IST

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా అందుకున్న మరో బిగ్గెస్ట్ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యిన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు దేశ వ్యాప్తంగా అది కూడా కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యి సంచలనం సెట్ చేసింది.

అయితే ఇప్పుడు మూడో వారాంతంలోకి వచ్చిన ఈ సినిమా మూడో శుక్రవారం హిందీ మార్కెట్లో రికార్డు వసూళ్లు నెంబర్ సెట్ చేసింది. నార్త్ మార్కెట్ లో రికార్డు వసూళ్లతో “పుష్ప 2” (Allu Arjun’s Pushpa 2) సినిమా సంచలనం సెట్ చేస్తే ఛావా దానిని కూడా మూడో శుక్రవారం పుష్ప 2 పేరిట ఉన్న రికార్డుని సాలిడ్ వసూళ్లతో బ్రేక్ చేసినట్టుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

పుష్ప 2 హిందీ వెర్షన్ కి 12.5 కోట్ల నెట్ వసూళ్లు నమోదు అయితే దీనిని ఛావా 13 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబట్టి ఆల్ టైం హైయెస్ట్ నెంబర్ ని సెట్ చేసింది. దీనితో పుష్ప 2 లాంటి సెన్సేషనల్ సినిమాని ఈ చిత్రం క్రాస్ చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ శనివారం, ఆదివారం మళ్ళీ ఛావా విధ్వంసం డెఫినెట్ గా చూపించనుంది. ఇక ఈ రెండు రోజుల నంబర్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు