2025 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ‘ఛావా’ మళ్లీ వచ్చేస్తోంది.. ఎక్కడంటే..?

Chhaava

బాలీవుడ్‌లో తెరకెక్కిన హిస్టారికల్ చిత్రం ‘ఛావా’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో విక్కీ కౌషల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాదిలో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి సిద్ధమైంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథను ఈసారి ఇంటిల్లిపాది చూసే అవకాశం రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ఆగస్టు 17న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్ ఛానల్‌లో టెలికాస్ట్ చేయనున్నారు.

కాగా, ఈ చిత్ర వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సంబంధించి ఓ స్పెషల్ ‘రౌండ్ టేబుల్’ ఈవెంట్‌ను ఛావా మేకర్స్ నిర్వహించారు. ముంబైలోని బాంద్రాలో జరిగిన ఈ ఈవెంట్‌లో విక్కీ కౌషల్, వినీత్ కుమార్ సింగ్, దివ్య దత్తా, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తదితరులు పాల్గొన్నారు.

బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోనూ సాలిడ్ వ్యూయర్‌షిప్ అందుకుంది. ఇక ఇప్పుడు బుల్లితెరపై తన సత్తా చాటేందుకు ఛావా సిద్ధమవుతున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి టీఆర్పీ రేటింగ్స్ అందుకుంటుందో చూడాలి. తాజా సినిమా అప్డేట్స్ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.

Exit mobile version