షారుఖ్ ఖాన్ మళ్ళి తిరిగొచ్చాడు. గత కొన్నిసంవత్సరాల తరువాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ రోజుతో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ లు రూ. 200 కోట్లను దాటాయి.దీనితో ఈ సినిమా చాలా తొందరగా రూ. 200 కోట్లు సాదించిన సినిమాగా రికార్డ్ సాదించింది. ఎక్కువగా కలెక్షన్ లు సాదించిన సినిమాగా ఇప్పటి వరకు ‘3 ఇడియట్స్’ ఉంది. అయితే త్వరలో ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా ఈ సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లను సాదిస్తుందని బావిస్తున్నారు. అలా అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో భారీ కలెక్షన్లు సాదించిన సక్సెస్ ఫుల్ సినిమా ఇదే అవుతుంది. దీపిక పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు.
‘చెన్నై ఎక్స్ ప్రెస్’ టీంకి అధినందనలు