గౌతమ్ మీనన్ సినిమాలు తీయరాదని ఆదేశాలిచ్చిన చెన్నై కోర్టు

gautham-menon
గౌతమ్ మీనన్ అభిమానులు ఒక పెద్ద షాక్ గురయ్యే విషయం అదేమిటంటే ఇక నుంచి గౌతమ్ మీనన్ సినిమాలు చేయరాదని చెన్నై సివిల్ కోర్టు ఆదేశించింది. గత కొన్ని రోజుల క్రితమే జయరామన్ అనే ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్ పై పిటీషన్ పెట్టాడు. ఈ డైరెక్టర్ కి జయరామన్ 4.5 కోట్లు ఇచ్చాడు, దాని కోసం గౌతమ్ 2008లో అతని బ్యానర్లో ఓ సినిమా చేయాలి. జయరామన్ – గౌతమ్ ఫ్రెండ్స్, అలాగే విన్నైతాండి ఒరువాయ నిర్మాతల్లో జయరామన్ కూడా ఒకరు.

ఇటీవలే సూర్యతో సినిమా చేస్తున్నానని గౌతమ్ అనౌన్స్ చేయడంతో కోపం తెచ్చుకున్న జయరామన్ గౌతమ్ తన బ్యానర్ లో సినిమా చేయకుండా పోస్ట్ పోన్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఇద్దరి శ్రేయోభిలాషులు ఇద్దర్నీ కూర్చొని తొందరగా సెటిల్ చేసుకోమని చెప్తున్నారు.

Exit mobile version