ప్రియమణి కెరీర్లోనే భారీ చిత్రం “చారులత”


ప్రియమణి ప్రధాన పాత్రలో రేపు విడుదల కానున్న చిత్రం “చారులత” మంచి అంచనాల మధ్యన విడుదల అవుతుంది ఈ చిత్రానికి పోన్ కుమరన్ దర్శకత్వం వహించగా ఈ చిత్రం తెలుగు,తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదల అవుతుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 స్క్రీన్ ల మీద విడుదల అవుతుంది. ప్రియమణి కెరీర్లో ఇదే భారీ విడుదల, ప్రస్తుతం ఆమె కన్నడ చిత్రాల మీద దృష్టి సారించారు, ఒకవేళ “చారులత” హిట్ అయితే తెలుగు మరియు తమిళంలో కూడా ఆమె తిరిగి తన సత్తా చూపించగలదు. ఈ చిత్రంలో ఆమె అవిభక్త కవలల పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం థాయ్ భాషలో వచ్చిన “అలోన్” అనే చిత్రానికి రీమేక్. ఇక్కడికి తగ్గట్టుగా చిత్రాన్ని మార్చారని సమాచారం. ఈ చిత్ర నిర్మాతలు రమేష్ కృష్ణ మూర్తి మరియు ద్వారకీష్ ఈ చిత్రం మీద పూర్తి ధీమాతో ఉన్నారు. ఈ చిత్రానికి తెలుగు “వెన్నెల 1 1/2” మరియు “అవును” చిత్రాల నుండి గట్టి పాటి ఎదురుకానుంది. “చారులత” చిత్రంతో ప్రియమణి తిరిగి బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంటుంద లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version