విడుదలకు సిద్దమైన ప్రేమ ఒక మైకం

Prema Oka Maikam (5)
గతంలో పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన అందాల భామ చార్మీ మరో సారి ‘ప్రేమ ఒక మైకం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ఈ నెల 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చార్మీ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో రాహుల్, శరణ్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో ’10త్ క్లాస్’, ‘నోట్ బుక్’ సినిమాలు తీసిన చందు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ‘ ఇది ఒక లవ్ స్టొరీ. మల్లిక, లలిత్, స్వాతి అనే ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. వారి ముగ్గురితో ప్రేమ ఎలా ఆదుకుంది అనేదాన్ని చాలా ఆసక్తికరంగా చిత్రీకరించాం. వేశ్య పాత్రలో కనిపించనున్న చార్మీ నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందని’ తెలిపాడు. బాగా పేరున్న జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు. గత కొద్ది రోజులుగా చార్మీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా అన్నా తనకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Exit mobile version