మరోసారి మంత్రమేయబోతున్న ఛార్మీ

Charmi
‘మంత్ర’ సినిమాలో ‘మాహా.. మాహ’ అంటూ కుర్రకారుని ఉర్రూతలూహించి వాళ్ళకి నిద్రపట్టనీయకుండా చేసిన బ్యూటీ ఛార్మీ. నిజానికి ఆ సినిమాతోనే ఛార్మీ టాలీవుడ్ లో బిజీ తారగా మారింది. ఇప్పుడు మనముందుకు మరోసారి ‘మంత్ర 2’గా మనముందుకు రానుంది. ఎస్.వి సురేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బోనాల శ్రీకాంత్, రవితేజ నిర్మాతలు. “హారర్ తరహాలో సాగే సినిమా ఇది. ఇది వరకు వచ్చిన ‘మంత్ర’ సినిమాకు దీనికి ఎటువంటి సంబంధంలేదు. వినగానే ఛార్మీ నటిస్తానని చెప్పింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి” అని దర్శకుడు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు

Exit mobile version