పూరి కథలో జోక్యం చేసుకోదట !

పూరి కథలో జోక్యం చేసుకోదట !

Published on Jul 19, 2020 1:03 AM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి మాజీ హీరోయిన్ ఛార్మి సినిమా నిర్మణంలో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. మరి నిర్మాత కాబట్టి కథ గురించి ఎలా ఆలోచిస్తోందని అందరికీ అనుమానాలు ఉంటాయి. చార్మీ ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పూరి రాసే స్క్రిప్ట్స్‌లో తానూ ఎలాంటి జోక్యం చేసుకోనని, అసలు కథ గురించి ఆలోచించనని చెప్పింది.

ఇక లాక్ డౌన్ సమయంలో కూడా పూరి ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలుస్తోంది. పూరి రాబోయే రోజుల్లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ లాక్ డౌన్ వ్యవధిలో పూరి వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా చేసాడట. ఇంకా స్క్రిప్టింగ్‌ లోనే బిజీగా ఉన్నాడట.

కాగా పూరి బాలయ్య కోసం కూడా కథ రాస్తున్నాడని.. ఇప్పటికే పూరి, బాలయ్యకి ఫోన్ లోనే కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేసిన పూరి.. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో వరుసగా హిట్స్ కొడతాడేమో చూడాలి.

ఇక విజయ్ దేవరకొండతో చేస్తోన్న ఫైటర్ చిత్రాన్ని అన్ని దక్షానిది భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. పూరి రాసిన ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందట.

తాజా వార్తలు