రామ్ చరణ్ ‘ఎవడు’ రిలీజ్ డేట్

రామ్ చరణ్ ‘ఎవడు’ రిలీజ్ డేట్

Published on Jun 10, 2013 3:54 PM IST

Yevadu1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎవడు’ సినిమా విడుదల విషయంలో కొద్ది రోజుల క్రిత్రం మేమొక రిలీజ్ డేట్ ని తెలిపాము. ఇప్పుడు అదే డేట్ ను ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అనౌన్స్ చేసింది. ఈ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియోని జూన్ చివరి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలని ఇటీవలే థాయ్ ల్యాండ్, స్విట్జర్ ల్యాండ్లలో చిత్రీకరించారు. ఇప్పటికే 90% పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన షూటింగ్ ని కూడా త్వరగా పూర్తి చేయనున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు జంటగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు