మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘తుఫాన్’ సినిమాకి డబ్బింగ్ చెబుతున్నారు. హిందీలో రానున్న ‘జంజీర్’ సినిమాకి ‘తుఫాన్’ తెలుగు వెర్షన్. ఈ సినిమాని సెప్టెంబర్ 6న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి, మరి కొద్ది రోజుల్లో పూర్తవుతాయి. డబ్బింగ్ తో పాటు మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రియంగా చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అపూర్వ లఖియా డైరెక్టర్.
ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసారు వాటన్నిటినీ యోగి చూసుకున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించనున్నాడు. ‘జంజీర్’ సినిమాతో చరణ్ బాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమా గతంలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘జంజీర్’ పేరుతో నటించిన సినిమాకి రీమేక్.