మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన సినిమా ‘తుఫాన్’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 27న రిలీజ్ చేయనున్నారు. మొదట ఈ సినిమా ఆడియోని ఆగష్టు 20న రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ నెల 27కి వాయిదా వేశారు. తెలుగులో ‘తుఫాన్’ గా వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ లో ‘జంజీర్’ గా విడుదలవుతోంది. అలాగే ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ బాలీవుడ్ కి పరిచయం కానున్నాడు.
అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళా వేదికలో జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 6న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనే విషయంపై ఈ చిత్ర నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు. ఫ్లైయింగ్ టార్టల్ ఫిల్మ్స్ సమర్పణలో రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.