మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘తుఫాన్’ సినిమా ఆడియోని ఆగష్టు 20న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. హిందీలో’జంజీర్’గా తెలుగులో ‘తుఫాన్’ గా ఈ సినిమాని నిర్మించారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల విషయాన్ని నిర్దారిస్తూ ట్విట్టర్ లో తెలియజేశారు. ఈ ఆడియో వేడుకలో న్యూ ప్రోమోస్, టీజర్, పోస్టర్స్ ను విడుదల చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాలో చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం జరిగింది. యోగి ఈ సినిమాలో అందరిని ఆశ్చర్యపరచనున్నాడు. ఈ సినిమాతో చరణ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడు.