మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కృష్ణ వంశీ డైరెక్ట్ చేస్తున్న ఫ్యామిలి ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాలో పోనీ టెయిల్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ కి సంబందించిన కొన్ని ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
చెప్పాలంటే రామ్ చరణ్ గత కొన్ని సంవత్సరాలుగా తన లుక్ ని అస్సలు మార్చుకోలేదు. అందుకే ఈ సినిమాతో తన ఇమేజ్ ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చరం ఈ సినిమాలో ఒక్క హెయిర్ స్టైల్ విషయంలోనే కాకుండా తన లుక్ కూడా మార్చుకొని సరికొత్తగా కనిపించనున్నాడు.
ఈ భారీ బడ్జెట్ మూవీలో రాజ్ కిరణ్, శ్రీ కాంత్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.