స్టెప్పులేయడానికి సిద్దమవుతున్న రామ్ చరణ్

Yevadu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ నెల 27 నుంచి ఓ సాంగ్ షూటింగ్లో పాల్గొనడానికి సిద్దమవుతున్నాడు. ఈ వారని రామ్ చరణ్ టీంకి దగ్గరగా ఉండే ఓ వ్యక్తి ఖరారు చేసాడు. ఈ సాంగ్ తన రాబోయే సినిమా ‘ఎవడు’ కోసం కాగా, ఈ పాటని రామోజీ ఫిలిం సిటీలోని కీసర స్ట్రెచ్ దగ్గర షూట్ చేసే అవకాశం ఉంది. జూలై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్న ఈ సినిమా ఆడియో జూన్ చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ ఆడిపాడుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ జంటగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version