రామ్ చరణ్ చేతుల మీదుగా సునీల్ సినిమా ఆడియో లాంచ్

Mr-Pellikoduku

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా కామెడీ హీరో సునీల్ నటించిన ‘Mr. పెళ్ళికొడుకు’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ సినిమా హిందీలో వచ్చిన ‘తను వెడ్స్ మను’ సినిమాకి రీమేక్. ఈ చిత్ర ఆడియో వేడుక రేపు శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది. 150 చిత్రాలకు పైగా సంగీతం అందించిన ఎస్.ఎ రాజ్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇషా చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించగా, దేవీ ప్రసాద్ డైరెక్ట్ చేసాడు.

Exit mobile version