ఐస్లాండ్ కి పయనమవనున్న రామ్ చరణ్

ఐస్లాండ్ కి పయనమవనున్న రామ్ చరణ్

Published on Aug 22, 2012 1:51 PM IST


‘నాయక్’ చిత్ర చిత్రీకరణ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ఐస్లాండ్ కి పయనమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ సినిమాలోని  ‘శుభలేఖ రాసుకున్న’ హిట్ పాటని ఈ చిత్రంలో రిమేక్ చేస్తున్నారు. ఈ పాటని ఐస్లాండ్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు. ఈ పాటలో చరణ్ తో కలిసి అమలా పాల్ స్టెప్పులేయనుంది.

వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ జోరుగా జరుగుతోంది. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరో కథానాయికగా నటిస్తోంది. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ‘నాయక్’ చిత్రాన్ని 2013 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు