తుఫాన్ కు డబ్బింగ్ పనులను ముగించిన రామ్ చరణ్

Thoofan (1)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్’ సినిమాకు తెలుగు వెర్షన్ అయిన ‘తుఫాన్’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను ముగించాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్. అపూర్వ లిఖియా దర్శకుడు.

ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ నెల 18న లేక 19న ముగించడానికి చాలా కృషిచేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలకు సిద్దంగావుంది. తెలుగు వెర్షన్ పలు చిన్న మార్పులతో విడుదలకానుంది. ఈ వెర్షన్ యోగి పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీ హరి భర్తీ చేసాడు.

‘తుఫాన్’ చిత్రాన్ని రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్, పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమిత్ ప్రకాష్ మెహ్రా మరియు ఫ్లైయింగ్ తుర్త్లె సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

Exit mobile version