ప్రియమణి ప్రధాన పాత్రలో కృష్ణం రాజు, శరత్ కుమార్ లు నటించగా ప్రముఖ దర్శకుడు వి సముద్ర దర్శకత్వం లో ఒమిక్స్ క్రియేషన్ పతాకం పై డా. శ్రినుబాబు నిర్మించిన చండీ చిత్ర యూనిట్ ఇటివలే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. కిరణ్ కుమార్ రెడ్డిని కలిసింది. ప్రబుత్వ గ్రేడ్ 4 ఎంప్లాయిస్ ఇళ్ళ స్థలాల కోసం ఎపిఎన్జీవోలతో కలిసి చండీ టీం ముఖ్య మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో తక్కువ వేతనాలు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు (అంటే పంట పొలాలకు నీటిని అందించే వారు) 1995లో కాకినాడ డివిజన్, కాకినాడ మండలంలోని రమణయ్య పేట చానల్, 3/5 నుండి 4/5 కిలోమీటర్ వరకు ఒక్కొక్క ఉద్యోగికి గతంలో అంటే 2001లో 120 గజాల చొప్పున స్తలం కేటాయించడం జరిగింది. అయితే దానికి సంబందించిన పత్రాలు ఇప్పటివరకు వారికి అందలేదు. వారు ఎన్నో రోజులుగా దానికోసం కాళ్ళరిగేల తిరిగిన కుడా ఎలాంటి పలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న చండి యూనిట్ వారితో కలిసి ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారికి తగిన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దర్శకుడు సముద్ర , సహా నిర్మాత ముమ్మిడి సత్య తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన చండీ యూనిట్
ముఖ్యమంత్రిని కలిసిన చండీ యూనిట్
Published on Nov 18, 2013 8:00 AM IST
సంబంధిత సమాచారం
- మారుతి కథతో సాయి తేజ్ సినిమా !
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- స్పెషల్ రోల్ ను డిజైన్ చేసిన రాజమౌళి ?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ న్యూస్ !
- ‘లెనిన్’ కోసం అఖిల్ యాస పై కసరత్తులు !
- సూపర్ స్టార్ కి మరో ప్రతిష్టాత్మక అవార్డు !
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ఓటీటీ’ : ఈ వారం అలరిస్తున్న క్రేజీ చిత్రాలు, సిరీస్ లు ఇవే !
- ‘విశ్వంభర’ కాదు ‘మన శంకర వరప్రసాద్’ నుంచి ట్రీట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- సమీక్ష : జాలీ ఎల్ ఎల్ బి 3 – కొంతమేర మెప్పించే కోర్టు డ్రామా
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- క్రేజీ.. ‘కాంతార 1’ కోసం దేవా.. వరదరాజ మన్నార్
- ‘ఓజి’ నుంచి ఊహించని అవతార్ లో సలార్ నటి
- ఫోటో మూమెంట్: తన ఫేవరెట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ భార్య
- చివరి అంకానికి చేరుకున్న యశ్ ‘టాక్సిక్’
- ‘ఓజి’ బ్రేకీవెన్ టార్గెట్ ఇంత మొత్తం.. జస్ట్ టాక్ చాలు