చందమామలో అమృతాన్ని ఆగష్టులో అందిస్తారట

Chandamama-Lo-Amrutham-5
గుణ్ణం గంగరాజు తన తాజా సినిమా ‘చందమామలో అమృతం’ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ ను భారీగా వాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటివరకూ ఈయన రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అవి ‘లిటిల్ సోల్డ్యర్స్’, ‘అమ్మ చెప్పింది’. ఇవిగాక ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘కథ’ లాంటి మరికొన్ని సినిమాలకి మాటలు రాసాడు. ఇప్పుడు ‘చందమామలో అమృతం’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారి సెట్ వేసారు. వి.ఎఫ్.ఎక్స్ ను వాడుకుని మనకు ఆకాశం, చందమామలో ఉన్నట్టు ఫీల్ ని కలిగిస్తారట.

మొత్తానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకి నాలుగు నెలలు పడుతుంది. ఇందులో 50 నిముషాల గ్రాఫిక్స్ ఉంటాయి. 2000లో గుణ్ణం గంగరాజు ఆలోచనలో పుట్టిన అమృతం సీరియల్ ఏ ఈ ‘చందమామలో అమృతం’ సినిమాకి ప్రేరణ. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, వాసు యింటూరి, హరీష్ మరియు శివ నారాయణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆద్యంతం నవ్వుల భరితంగా సాగుతుందట. ఈ చిత్రం ఆగష్టులో విడుదల కావచ్చు.

Exit mobile version