మంచు లక్ష్మి, నరేష్, ఆమని, కృష్ణుడు, చైతన్య కృష్ణ, సాయి కుమార్, సౌమ్య మరియు నాగ శౌరి ప్రాధాన పాత్రధారులుగా నటిస్తున్న చందమామ కధలు సినిమా మార్చ్ 14న మనముందుకు రానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. చాణుక్య బోనేటి నిర్మాత.
ఈ సినిమా ఆడియో నిన్న రాత్రి విడుదలైంది. ఈ వేడుకకు చిత్రబృందమంతా హాజరయ్యారు. ఆడియో క్యాసెట్లు, సి.డి లకు బదులుగా పాటలను ఇంటర్నెట్ లో విడుదల చేసారు. “సినిమా రూపుదిద్దుకునే విధానమేకాదు. సినిమాలో వున్న వ్యాపారం కూడా మారుతున్న రోజులివి. పంపిణీరంగం, లైవ్ స్ట్రీమింగ్ విధానం సినిమాపై మార్పులను తెచ్చిపెట్టాయి. కాబట్టి ఈ సినిమాను నోకియా మరియు ఐట్యూన్స్ లలో విడుదల” చేశామని చెప్పారు.
మిక్కి జె మేయర్ సంగీతదర్శకుడు. 8విభిన్న కధల వినూత్న కధాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాబట్టి ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే ముఖ్య భూమిక పోషించనుందని అర్ధమవుతుంది. చూద్దాం ఈ చిత్రం ఎలాంటి జ్ఞాపకాన్ని అందిస్తుందో.