‘మనం’ అనే సినిమాతో మొత్తం అక్కినేని అభిమానులు తమ లైఫ్ లోనే మర్చిపోలేని ఒక మధురమైన సినిమాను అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్. అదే కాకుండా తన సినిమాలతో ఎప్పటికప్పుడు ఒక సరికొత్త ఫీలింగ్ ను ఇచ్చే ఈ దర్శకుడు ఇటీవలే అక్కినేని యువ హీరో యువసామ్రాట్ నాగ చైతన్య తో “థ్యాంక్ యూ” అనే సినిమాను మొదలు పెట్టారు.
ఈ కాంబోలో మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు కూడా సెట్టయ్యాయి. అయితే ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ లో చైతు ఒక స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. అది కూడా ఒక హాకీ ప్లేయర్ రోల్ లో అన్నట్టు టాక్. ఇది వరకే చైతు తన లాస్ట్ చిత్రం “మజిలీ”లో కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కనిపించిన సంగతి తెలిసిందే. మరి ఈ ఈ సినిమాలో కూడా అలాంటి రోల్ లోనే కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.