చైతూ ‘లవ్ స్టోరీ’ ఇంత కాస్ట్లీనా !

చైతూ ‘లవ్ స్టోరీ’ ఇంత కాస్ట్లీనా !

Published on Feb 4, 2020 10:56 PM IST

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటెర్టైనర్లో చైతూ తెలంగాణ పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనేది టైటిల్. ఈ సినిమా మీద చైతూ మంచి హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. ప్రేక్షకులు సైతం ఈ ప్రాజెక్ట్ తప్పకుండా చైతూ కెరీర్లో వసూళ్ళ పరంగా కొత్త ఫిగర్స్ నమోదుచేయవచ్చని అనుకుంటున్నారు.

విడుదల తర్వాతి సంగతి ఎలా ఉన్నా విడుదలకు ముందే ఈ చిత్రం చైతూకు ఇక రికార్డ్ అందించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తోడు సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం. అందుకే వీరి జోడీపై అంచనాలు పెరిగాయి. పైగా ప్రేమ కథల విషయంలో చైతూ ఛాయిస్ బాగుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఈ అంశాలన్నీ కలిసి చిత్రాన్ని పెద్ద మొత్తానికి అమ్ముడయ్యేలా చేశాయి.

తాజా వార్తలు