మా నాన్న లుక్ నాకు ఈర్ష్య కలిగిస్తుంది – నాగ చైతన్య


ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు నాగార్జున నూతన లుక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యనే 52 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాగార్జున ఇప్పటికీ యువతరం హీరోకి మంచి పోటీని ఇస్తున్నారు. చూస్తుంటే అయన కొడుకుకి కూడా ఈయన పోటి వస్తున్నారు అనిపిస్తుంది. నాగ చైతన్య ఇదే అనుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ఒకానొక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ నాగ చైతన్య “మా నాన్నగారి కొత్త లుక్ చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది ఆయన 50లో కూడా ఇంత అందంగా కనిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతయినా టాలివుడ్ మన్మధుడు కదా” అని అన్నారు. నాగ చైతన్య ప్రస్తుతం తమిళంలో లింగు స్వామి దర్శకత్వంలో ఆర్య మరియు మాధవన్ ప్రధాన పాత్రలలో వచ్చిన “వెట్టై” చిత్ర రీమేక్ లో నటిస్తున్నారు. ఇందులో ఈయన ఆర్య పాత్రలో నటిస్తున్నారు తమన్నాతో అయన చేస్తున్న రెండవ చిత్రం ఇది గతంలో వీరి కలయికలో వచ్చిన ‘100% లవ్’ చిత్రం భారీ విజయం సాదించింది. కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్ మరియు ఆండ్రియా జేర్మేయ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇది కాకుండా నాగ చైతన్య, దేవ్ కట్ట దర్శకత్వంలో “ఆటోనగర్ సూర్య” చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Exit mobile version