సెన్సార్ బోర్డ్లో వివాదం ముదిరింది


గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సెన్సార్ బోర్డ్ తో ఫిల్మ్ ఇండస్ట్రీకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మరియు చాలా మంది ఈ విషయంపై ఏమైనా చేయాలని కూడా అనుకుంటున్నారు. రీజనల్ ఆఫీసర్ గా శ్రీమతి. ధనలక్ష్మి వచ్చిన తర్వాత సెన్సార్ బోర్డ్లో చాలా మార్పులు చేసారు. చాలా సందర్భాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమె పనితీరుపై అధికారికంగా ఫిర్యాదులు కూడా చేసారు.

ఇప్పుడు అవి మరీ ఎక్కువ కావడంతో ఆంధ్రప్రదేశ్ సెన్సార్ బోర్డ్లోని కొంత మంది సభ్యులు కలిసి సమాచార మరియు ప్రసార శాఖామంత్రి అయిన శ్రీమతి అంబిక సోని గారికి అధికారికంగా ఫిర్యాదు చేసారు. వారు ఆమె పదవీ దుర్వినియోగం, అవినీతికి పాల్పడడం మరియు బంధు ప్రీతి అనే అంశాల మీద కంప్లైంట్ చేసారు.

ముఖ్యంగా శ్రీమతి ధనలక్ష్మి మీద ఇచ్చిన సాధారణ ఫిర్యాదు ఏమిటంటే కొన్ని సినిమాల్లో చాలా సన్నివేశాలకు కట్స్ విదించడం మరియు కొన్ని సన్నివేశాల్లో దేవుణ్ణి దూషించే డైలాగులు ఉన్నా కానీ కట్ చేయకపోవడం లాంటి పక్షపాత పని తీరుపై ఫిర్యాదు చేసారు. ఈ విషయంపై ఎలాంటి తీర్పు వస్తుందా అని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది.

Exit mobile version