గతంలో గుణశేఖర్ దర్శకత్వం నుండి కొన్ని మరపురాని హిట్లు వచ్చాయి. కానీ ఈ మధ్య వరుస పరాజయాలతో అతను కష్టకాలంలో వున్నాడు. ప్రస్తుతం అతను ‘రుద్రమదేవి’ని తయారుచేసే పనిలో వున్నాడు
ఈ సినిమాలో గుణశేఖర్ ఆసక్తికరమైన తారాగణాన్ని ఎంచుకున్నాడు. అనుష్క మరియు రానా దగ్గుబాటి ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. కృష్ణంరాజు ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. మహేష్ బాబు అతిధి పాత్రలో కనిపిస్తున్నాడు అనే పుకారుకూడా వుంది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో మనకు కనిపించిన కేథరీన్ త్రేస ఈ సినిమాలో గోన గన్నారెడ్డి కి ప్రేయసిగా కనిపిస్తుంది. అనుష్క, కేథరీన్ లను చిత్రీకరిస్తూ ఒక పాటకూడా షూట్ చేశారు
ఇళయరాజా ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. తోట తరుణి కళ్ళు చెదిరే సెట్ లను రూపొందిస్తున్నాడు