నాగశౌర్య కొత్త చిత్రం ‘వరుడు కావలెను’

నాగశౌర్య కొత్త చిత్రం ‘వరుడు కావలెను’

Published on Nov 13, 2020 10:04 PM IST


యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే మూడు చిత్రాలు చేతిలో ఉన్న ఆయన తాజాగా మరొక సినిమాకు కమిటయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. దీపావళి సందర్బంగా ఈ సినిమా యొక్క టైటిల్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు టీమ్. సినిమాకు రెగ్యులర్ టైటిల్ కాకుండా కథకు యాప్ట్ అయ్యేలా అచ్చ తెలుగు పేరును పెట్టారు. అదే ‘వరుడు కావలెను’. వినడానికే ఏదో మ్యాట్రిమోనీ ప్రకటనల ఉంది కదా. కానీ ఇదే సినిమా టైటిల్.

టైటిల్ విన్న నెటిజన్లు చాలా కొత్తగా, తాజాగా ఉందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. టైటిల్ వింటేనే సినిమా థీమ్ ఏమిటో అర్థమవుతోందని అంటున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో నాగశౌర్యకు జోడీగా రీతువర్మ నటించనుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. హీరోహీరోయిన్లతో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత అందిస్తుండగా వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పి.డి.వి.ప్రసాద్ సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు